ఆకాశమా ఆలకించుమా
Aakasama alakinchuma
ఆకాశమా ఆలకించుమా పల్లవి : ఆకాశమా ఆలకించుమా.... ఓ భూమి నీచెవి యొగ్గుమా... నేను పిల్లలను పెంచి గొప్ప వారినిగా చేసితి వారు నాపైనే తిరుగుబాటుచేసితిరే || ఆకాశమా||(1) యెద్దుకు తెలుసు యజమానుడు గాడిద యెరుగును తన దొడ్డిని నా ప్రజలకు తెలివేలేదాయెనే నను విడిచి సృష్టిని పూజింతురే || ఆకాశమా||(2) పశుప్రాయులై మృగవాంఛతో కామాంధులై చెడిపోయిరే జీవజలముల ఊటను నను విడచి ఎండమావికై ఎడారి పాలైరే ||ఆకాశమా||