amdhamaina kreesthu katha mee అందమైన క్రీస్తు కథ మీ రాలింపరయ
అందమైన క్రీస్తు కథ మీ రాలింపరయ్య ||అందమైన||
1. పొందుగ శిష్యులతో యేసు పోవుచుండు మార్గమందు ముందుగ
వీక్షించి రొక్క పు ట్టంధకుని అందుఁ గొందఱు శిష్యు లాత్మలో భావించి
రెందు కీతఁడు చీక య్యెను దీని విధమేమో డెందములనుఁ గల్గు
సందియములు వీడ విందమనుచు లోక వంద్యుని సంతతా నందుని
మనుజ నందనుని నడిగిరప్పు ||డందమైన||
2. చీకువాఁడై జన్మించుటకుఁ జేసెనా దుష్కృతము నితఁడు లేక వీని జననీ
జనకు లేమి చేసిరో యీ కారణముఁ దెల్పు మోకర్త యిపుడీవు
మాకంచు తను వేఁడ లోకేశ్వరుండు ని రాకారుఁ డితనియం
దీకార్యములుఁ జూపఁ బ్రాకటముగఁ జేసెఁ గాక వేరొకవిధము లేకున్నదని
తెల్పి చీకుఁ బ్రోవఁ దలంచె ||నందమైన||
3. బురద వాని కన్నులందుఁ గరములతోఁ జమిరియొక్క చెఱవులో
బ్రాక్షాళించుటకు సెలవిచ్చెఁ బ్రభువు బిరబిర నయ్యంధుఁ డరిగి యేసుని
పల్కుఁ దిరముగ మదినమ్మి సరసిలో మునిఁగి సుం దరమైన నేత్రముల్
ధరియించి యానంద భరితుడై చనుదెంచు తఱివాని పొరుగింటి
నరులబ్బురముగఁ జూ చిరి మార్మోమగువాని ||నందమైన||
4. చూపులేని గ్రుడ్డివానిఁ జూడఁ గలుగఁజేయువాఁడే పాపాంధకార
మగ్నుల నా ప్రభువే రక్షించు పైపైని మనకన్ను చూపు చూపది గాదు
లోపలి కనుగుడ్డి యైపోయి యున్నది యాప త్పరంపర లోఁ
బొరలుచున్నాము కాపాడుమని యేసు శ్రీ పాదములుఁ బట్టి చూపు
లోపలి చూపుఁ జూచి యానందింత ||మందమైన||
aMdhamaina kreesthu kaTha mee raaliMparayya ||aMdhamaina||
1. poMdhuga shiShyulathoa yaesu poavuchuMdu maargamMdhu muMdhuga
veekShiMchi rokka pu ttMDhakuni aMdhuAO goMdhaRu shiShyu laathmaloa bhaaviMchi
reMdhu keethAOdu cheeka yyenu dheeni viDhamaemoa deMdhamulanuAO galgu
sMdhiyamulu veeda viMdhamanuchu loaka vMdhyuni sMthathaa nMdhuni
manuja nMdhanuni nadigirappu ||dMdhamaina||
2. cheekuvaaAOdai janmiMchutakuAO jaesenaa dhuShkruthamu nithAOdu laeka veeni jananee
janaku laemi chaesiroa yee kaaraNamuAO dhelpu moakartha yipudeevu
maakMchu thanu vaeAOda loakaeshvaruMdu ni raakaaruAO dithaniyM
dheekaaryamuluAO joopAO braakatamugAO jaeseAO gaaka vaerokaviDhamu laekunnadhani
thelpi cheekuAO broavAO dhalMche ||nMdhamaina||
3. buradha vaani kannulMdhuAO garamulathoaAO jamiriyokka cheRavuloa
braakShaaLiMchutaku selavichcheAO brabhuvu birabira nayyMDhuAO darigi yaesuni
palkuAO dhiramuga madhinammi sarasiloa muniAOgi suM dharamaina naethramul
DhariyiMchi yaanMdha bharithudai chanudheMchu thaRivaani porugiMti
narulabburamugAO joo chiri maarmoamaguvaani ||nMdhamaina||
4. choopulaeni gruddivaaniAO joodAO galugAOjaeyuvaaAOdae paapaaMDhakaara
magnula naa prabhuvae rakShiMchu paipaini manakannu choopu choopadhi gaadhu
loapali kanuguddi yaipoayi yunnadhi yaapa thparMpara loaAO
boraluchunnaamu kaapaadumani yaesu shree paadhamuluAO batti choopu
loapali choopuAO joochi yaanMdhiMtha ||mMdhamaina||