ఇదిగో నేనొక నూతన
Idigo Nenuoka Noothana
ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను (2)
ఈనాడే అది మొలచును దాని నాలోచింపరా (2) ||ఇదిగో||
అడవిలో త్రోవనుజేసి – ఎడారిలో నదులను నేను (2)
ఎల్లప్పుడు సమృద్ధిగా – ప్రవహింప జేసెదను (2) ||ఇదిగో||
నాదు ప్రజలు త్రాగుటకు – నేనరణ్యములో నదులు (2)
సమృద్ధిగా పారునట్లు – సృష్టించెదను నేను (2) ||ఇదిగో||
అరణ్యములో జంతువులు – క్రూరపక్షులు సర్పములు (2)
ఘనపరచును స్తుతియించును – దీని నాలోచించుడి (2) ||ఇదిగో||
నూతన సృష్టిగ నినుజేసి – నీ శాంతిని నదివలెజేసి (2)
ననుజూచి మహిమపరచి – స్తుతిబాడ జేసెదను (2) ||ఇదిగో||
నేనే దేవుడనని దెలసి – నా కార్యములను నెరవేర్చి (2)
ముందున్న వాటికన్న – ఘనకార్యములను జేతున్ (2) ||ఇదిగో||
మరుగైన మన్నానిచ్చి – మరితెల్లని రాతినిచ్చి (2)
చెక్కెదనా రాతిమీద – నొక క్రొత్త నామమును (2) ||ఇదిగో||
పరలోక భాగ్యంబులు – నరలోకములో మనకొసగెన్ (2)
కరుణాసంపన్నుడగు – మన ప్రభువునకు హల్లెలూయ (2) ||ఇదిగో||
idigo nenuoka noothana kriyanu cheyuchunnanu (2)
eenaade adi molachunu daani naalochimparaa (2) ||idigo||
adavilo throvanujesi – edaarilo nadulanu nenu (2)
ellappudu samruddhigaa – pravahimpa jesedanu (2) ||idigo||
naadu prajalu thraagutaku – nenaranyamulo nadulu (2)
samruddhigaa paarunatlu – srushtinchedanu nenu (2) ||idigo||
aranyamulo janthuvulu – kroorapakshulu sarpamulu (2)
ghanaparachunu stuthiyinchunu – dini naalochinchudi (2) ||idigo||
noothana srushtiga ninu jesi – nee shaanthini nadivale jesi (2)
nanu joochi mahimaparachi – sthuthi baada jesedanu (2) ||idigo||
nene devudanani delasi – naa kaaryamulanu neraverchi (2)
mundunna vaatikanna – ghanakaryamulanu jethun (2) ||idigo||
marugaina mannaanichchi – mari thellani raathinichchi (2)
chekkedanaa raathimeeda – noka krottha naamamunu (2) ||idigo||
paraloka bhaagyambulu – naralokamulo manakosagen (2)
karunaasampannudagu – mana prabhuvunaku halleluya (2) ||idigo||