rende rende daarulu రెండే రెండే దారులు
రెండే రెండే దారులు ఏ దారి కావాలో మానవా ఒకటి పరలోకం మరియొకటి పాతాళం (2) పరలోకం కావాలో పాతాళం కావాలో తెలుసుకో మానవా (2)పరలోకం గొప్ప వెలుగుతో ఉన్నాది పరిశుద్ధుల కోసం (2) సూర్యుడుండడు చంద్రుడుండడు చీకటుండదు రాత్రియుండదు నిత్యుడైన యేసుడే ప్రకాశించుచుండును (2) యుగయుగములు పరలోక రాజ్యమేలుచుండును (2) యేసు ప్రభుని నమ్ముకో పరలోకం చేరుతావు (2) ||రెండే||పాతాళం అగ్ని గుండము ఉన్నాది ఘోరపాపుల కోసం (2) అగ్ని ఆరదు పురుగు చావదు గప్పగప్పున రగులుచుండును ధనవంతుడు మరణించి అగ్నిలో ఉన్నాడు (2) అబ్రహాము రొమ్ముపై లాజరును చూసాడు (2) ధనవంతుడు చూసి ఆశ్చర్యపడ్డాడు (2) ||రెండే||పుడతావు నీవు దిగంబరిగా వెళతావు నీవు దిగంబరిగా (2) గాలి మేడలు ఎన్నో కడతావు నాకంటే ఎవ్వరు ఉన్నారంటావు లోకంలో ఘోరమైన పాపాలు చేస్తావు (2) ఆ పాపాలే నిన్ను అగ్నిపాలు చేస్తాయి (2) అగ్నిలో పడకుండా యేసు ప్రభుని నమ్ముకో (2) ||రెండే||
Rende Rende Daarulu Ae Daari Kaavaalo Maanavaa Okati Paralokam Mariyokati Paathaalam (2) Paralokam Kaavaalo Paathaalam Kaavaalo Thelusuko Maanavaa (2)Paralokam Goppa Velugutho Unnaadi Parishudhdhula Kosam (2) Sooryudundadu Chandrudundadu Cheekatundadu Raathriyundadu Nithyudaina Yesude Prakaashinchuchundunu (2) Yugayugamulu Paraloka Raajyameluchundunu (2) Yesu Prabhuni Nammuko Paralokam Cheruthaavu (2) ||Rende||Paathaalam Agni Gundamu Unnaadi Ghorpaapula Kosam (2) Agni Aaradu Purugu Chaavadu Gappugappunaa Raguluchundunu Dhanavanthudu Maraninchi Agnilo Unnaadu (2) Abrahaamu Rommupai Laazarunu Choosaadu (2) Dhanavanthudu Choosi Aascharyapaddaadu (2) ||Rende||Pudathaavu Neevu Digambarigaa Velathaavu Neevu Digambarigaa (2) Gaali Medalu Enno Kadathaavu Nakante Evvaru Unnaarantaavu Lokamlo Ghoramaina Paapaalu Chesthaavu (2) Aa Paapaale Ninnu Agnipaalu Chesthaayi (2) Agnilo Padakunda Yesu Prabhuni Nammuko (2) ||Rende||