• waytochurch.com logo
Song # 29655

స్తుతి ఘన మహిమకు పాత్రుడవు నిన్న నేడు నిరంతరం

Sthuthi Ghana Mahimaku


స్తుతి ఘన మహిమకు పాత్రుడవు - నిన్న, నేడు, నిరంతరం
ఆరాధనకు యోగ్యుడవు - ఇప్పుడు, ఎప్పుడు, ఎల్లప్పుడు (2)
నీ వాక్యముతో నను బలపరచి - నీ రక్షణలో నను స్థిరపరచి (2)
విడువను, ఎడబాయను - అని వాగ్దానము చేసిన తండ్రి (2)
IIస్తుతి ఘనII
1. నీవే నీవే నా మార్గము - నీ వాక్యమే నా జీవము (2)
నా పాపములన్నియు క్షమియించి - నా దోషములన్నియు భరియించి (2)
సిలువపై బలియాగమై - నిత్య జీవమునిచ్చిన యేసయ్య (2)
IIస్తుతి ఘనII
2. నీవే నీవే నా కాపరి - నీ ఆత్మయే నా ఊపిరి (2)
నీ కృప కనికరములే చూపించి - నీ సంరక్షణలో నను కాచి (2)
తల్లివై, నా తండ్రివై - కనురెప్పగ కాచిన యేసయ్య (2)
IIస్తుతి ఘనII


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No
  • Song youtube video link :
    Copy sharelink from youtube and paste it here

© 2025 Waytochurch.com