idugoa gorrelakaapari soadharuఇడుగో గొఱ్ఱెలకాపరి సోదరులారా య
ఇడుగో గొఱ్ఱెలకాపరి సోదరులారా యిడుగో గొఱ్ఱెలకాపరి కడగానరాని
కారడవిలో నలసట పడెడు గొఱ్ఱెలను పేరిడిబిల్చి రక్షించు ||నిడుగో||
1. చెదిరిపోయిన గొఱ్ఱెనై దొడ్డికిఁబోవ ముదములేనివాడనై
మృదుమధురంపు నీ నాదమా లించక కర్త కొదిఁగి యుండక మూఢ
హృదయుఁడనైతి ||నిడుగో||
2. దూరంబునకుఁబోతిని జనకుని కృపా సారంబుఁ గొననైతిని కారు
మూర్ఖపుపిల్ల గా సంచరించినా కూరిమి యిలుఁబాసి దారి దొలగిపోతి
||నిడుగో||
3. తనదు గొఱ్ఱెను జూచెను బోయఁడు తండ్రి తనశిశువును గాంచెను
కనికరమెదలో నిం డినవారలై నన్ను వన గిరికటకాదు లను వెంబడించిరి
||ఇడుగో||
4. ప్రాణావసర మప్పుడు యేకాకినై క్షీణించియున్నప్పుడు త్రాణార్థమగు
నెనరు త్రాళ్లతో ననుగట్టి నాణెంబుగా(దెచ్చి నన్ను రక్షించెను ||ఇడుగో||
5. చెడుగు మెకములవల్లను బాధలనొంది కడుమలినమై యుండను
కడిగి గాయములన్ని గట్టి శుభ్రముచేసి తడయక నాయింట నిడి
నెమ్మది యొసంగె ||నిడుగో||
6. ప్రభుయేసు నా బోయఁడు యీతఁడె భూమి నభము లేలెడి రాయఁ
డు శుభమైన తనదివ్య శోణిత మొసఁగియ వ్విభుఁడు ప్రేమించి దీ
వించి స్వస్థముఁజేసె ||నిడుగో||
7. నన్ను దొడ్డిని బెట్టెను పోయినగొఱ్ఱె తెన్ను వెదకిపట్టెను సన్నంపు
పచ్చిక యున్ను జీవనపూట లున్నుఁ గల్గెడిచోట్ల నన్నుంచి రక్షించె
||నిడుగో||
8. నేను మూర్ఖపుగొఱ్ఱెనై లోబడకుంటి మానసమున వెర్రినై పూని
యిప్పుడు కాచే వాని శబ్దము ప్రేమ తో నాలింపుచు దొడ్డి
నానందముననుందు ||నిడుగో||
9. చెడ్డబిడ్డనై యుంటిని యిటునటుబోవ నెడ్డెతనముఁ గొంటిని
మెడ్డులేకిపుడు ప్రే మింతు నా ప్రియజనకు దొడ్డ శబ్దము వాంఛిం
తును ముక్తి నిలయంబు ||ఇడుగో||
idugoa goRRelakaapari soadharulaaraa yidugoa goRRelakaapari kadagaanaraani
kaaradaviloa nalasata padedu goRRelanu paeridibilchi rakShiMchu ||nidugoa||
1. chedhiripoayina goRRenai dhoddikiAOboava mudhamulaenivaadanai
mrudhumaDhurMpu nee naadhamaa liMchaka kartha kodhiAOgi yuMdaka mooDa
hrudhayuAOdanaithi ||nidugoa||
2. dhoorMbunakuAOboathini janakuni krupaa saarMbuAO gonanaithini kaaru
moorkhapupilla gaa sMchariMchinaa koorimi yiluAObaasi dhaari dholagipoathi
||nidugoa||
3. thanadhu goRRenu joochenu boayAOdu thMdri thanashishuvunu gaaMchenu
kanikaramedhaloa niM dinavaaralai nannu vana girikatakaadhu lanu veMbadiMchiri
||idugoa||
4. praaNaavasara mappudu yaekaakinai kSheeNiMchiyunnappudu thraaNaarThamagu
nenaru thraaLlathoa nanugatti naaNeMbugaa(dhechchi nannu rakShiMchenu ||idugoa||
5. chedugu mekamulavallanu baaDhalanoMdhi kadumalinamai yuMdanu
kadigi gaayamulanni gatti shubhramuchaesi thadayaka naayiMta nidi
nemmadhi yosMge ||nidugoa||
6. prabhuyaesu naa boayAOdu yeethAOde bhoomi nabhamu laeledi raayAO
du shubhamaina thanadhivya shoaNitha mosAOgiya vvibhuAOdu praemiMchi dhee
viMchi svasThamuAOjaese ||nidugoa||
7. nannu dhoddini bettenu poayinagoRRe thennu vedhakipattenu sannMpu
pachchika yunnu jeevanapoota lunnuAO galgedichoatla nannuMchi rakShiMche
||nidugoa||
8. naenu moorkhapugoRRenai loabadakuMti maanasamuna verrinai pooni
yippudu kaachae vaani shabdhamu praema thoa naaliMpuchu dhoddi
naanMdhamunanuMdhu ||nidugoa||
9. cheddabiddanai yuMtini yitunatuboava neddethanamuAO goMtini
meddulaekipudu prae miMthu naa priyajanaku dhodda shabdhamu vaaMChiM
thunu mukthi nilayMbu ||idugoa||