oa vimtha naa rakshkuaodaa naఓ వింత నా రక్షకుఁడా నాకై నీ వ
Chords: ragam: భైరవి-bhairavi
ఓ వింత! నా రక్షకుఁడా నాకై నీ విలువ రక్తము కార్చితివా జీవాధిపతి
మృతిఁ జెందె నహహా పురుగు వంటి నాకై నీ జీవ మర్పించి నావా
||ఓ వింత||
1. నేను జేసిన పా పములకు నాయన మ్రానిమీఁదను మూల్గినావా
నేను గ్రహింపలేని నీ జాలి కరుణ మితి లేని ప్రేమ దీని వలనను
గనుపడుచు నున్నది ||ఓ వింత||
2. పరమ శరీరుఁడు తా మరణ రక్తంబుచేతఁ గరుణతో నన్నుఁ బ్రోచినాఁ
డా మరుతునా యీ ప్రేమ నా మరణంబు నందు సహా కర్తృ
కటాక్షములు కలకాల ముండు నాతో ||ఓ వింత||
3. నా యేసు నాధ నీకు నేనచ్చియున్న దెల్ల నా లేమితోఁ బ్రేమ గదా
నియమంబు గల ప్రభువా నీకెట్లు చెల్లించెదను నన్ను నేనే నీకు
నర్పించుకొనుట గాక ||ఓ వింత||