ఆపత్కాలమున తన పర్ణశాలలో
Aapatkalamuna tana parnashalalo
ఆపత్కాలమున తన పర్ణశాలలో
తన గుడారపు మాటున నన్ను దాచెను
ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను
1. యెహోవా నా ప్రాణ దుర్గము
నేను ఎవరికి వెరతును
నా చేయి విడువని దేవుడుండగా
నేను భయపడను
2. ఇహలోక దుఃఖ బాధలలో
నీవు నాతో ఉన్నావు
ముదిమి వచ్చువరకు
నన్ను ఎత్తుకొనే దేవుడవు
3. నీవుగాక వేరే ఆశ నాకు లేనే లేదు
నిత్యము నీ పై ఆనుకొని
నిశ్చింతగా సాగేదన్ ఆ ...
హల్లెలూయ .... హల్లెలూయ
4. లెక్కించలేని అధ్భుతములు
మక్కువతో చేసిన దేవా
నీవు చేసిన కార్యములకై
నేను ఏమి అర్పింతును
5. స్వచ్ఛమైన నిత్య ప్రేమను
నాపై చూపినదేవుడవు
కొట్లా కొలది స్తోత్రములు
నిరతము నీకే ప్రభువా