మహా మహుడవని నిన్ను గలమెత్తి కొనియాడెదన్
Mahamahudu mahamahudavani ninnu galamethi
మహా మహుడవని నిన్ను గలమెత్తి కొనియాడెదన్ మహోన్నతుడవని నీ మహిమను నే చాటెదన్ ||2|| ఆపత్కాలములో నమ్మదగిన నజరేయుడా ఆశ్చర్య కార్యములు జరిగించు అద్వితీయుడా నిన్ను కీర్తింతును.... నిన్ను ఘనపరతును యేసు నీకే ఆరాధన.... నా తండ్రి నీకే ఆరాధన -- ||2|| నా యజమానుడా విజయశీలుడా ప్రేమాపూర్ణుడా నా ఆరాధ్యుడా ||2|| ||మహామహుడవని|| బానిసత్వములొ ఉన్న నీ ప్రజలు - వారి కష్టములొ నిన్ను చేరగా || 2|| నీ ప్రజల బాధను వారి ఆవేదనను కన్నీటి రోధనను చూచిన వాడవయా ||2|| ఎంత మంచి దేవుడవయ్య కృపతో రక్షించినావయ్య ఎంత మంచి దేవుడవు యేసయ్యా నీ ప్రేమకు సాటి లేదయ్యా || యేసు నీకే ఆరాధన|| అంధకారములొ ఉన్న నన్ను నీవు అనేకులకు నీ వెలుగుగా మార్చితివి ||2|| ఇంతగ నన్ను హెచ్చించుటకు దీవించుటకు ఏ పాటివాడను ||2||నీవంటి దేవుడు లేడయ్య కృపతో ఘనతిచ్చినావయ్య నీవంటి దేవుడు ఎవరయ్యా నీ సంకల్పం ఎంతో గొప్పదయ్య || యేసు నీకే ఆరాధన ||