జగములలో నీవే మా ప్రభు
జగములలో నీవే మా ప్రభూ..
అనుదిన స్తోత్రార్హుడవు..
వెదికిన దొరుకునా.. నీ వంటి వారు..
కానరాలేదె ఈ యుగాలలో నీతో సమానం..
నిరంతరం నీవే స్తోత్రార్హుడా..
చరణం 1:
నీవైపుకు నా స్వరము వినపడగానే...
నిలిచిన ఆరాద్యుడా ...
నీ చల్లని స్పర్శతో నను
స్వస్థపరిచావే
ఎంత ప్రేమ నాపై ఎంత జాలి నీదయ్య..
నిరంతరం నీవే స్తోత్రార్హుడా..
!! జగములలో నీవే మా ప్రభూ అనుదిన స్తోత్రార్హుడవు వెదికిన దొరుకునా నీ వంటి వారు,
కానరాలేదె ఈ యుగాలలో..
నీతో సమానం !!
చరణం 2:
నా శాపము నీవు మోసినావు..
సిలువులో నాకై శ్రమ నొందినావు..
తండ్రి ప్రేమకు అర్హునిగా నను మలిచినావే..
ఎంత ప్రేమ నాపై ఎంత జాలి నీదయ్య...
నిరంతరం నీవే స్తోత్రార్హుడా...
!! జగములలో నీవే మా ప్రభూ అనుదిన స్తోత్రార్హుడవు వెదికిన దొరుకునా నీ వంటి వారు,
కానరాలేదె ఈ యుగాలలో
నీతో సమానం !!
చరణం 3:
నీ రాజ్యము పరలోకము
నీ బోధలే సన్మార్గమూ..
నీతో ఉండుటయే నీ చిత్తమై
పరమను విడచి
నను చేరినావు..
నీతో జీవించుట
నీ నిత్య సంకల్పమే..
ఎంత ప్రేమ నాపై ఎంత జాలి నీదయ్య...
నిరంతరం నీవే స్తోత్రార్హుడా...
!! జగములలో నీవే మా ప్రభూ అనుదిన స్తోత్రార్హుడవు వెదికిన దొరుకునా నీ వంటి వారు,
కానరాలేదె ఈ యుగాలలో
నీతో సమానం!!