paapulayeda kree sthuni priya పాపులయెడ క్రీ స్తుని ప్రియ మెట
పాపులయెడ క్రీ స్తుని ప్రియ మెట్టిదో పరికింపరె క ల్వరిగిరిపై
నాపదలను దన కీగతిఁ బెట్టెడు కాపురుషుల దెసఁ గనుగొను కృపతో
||బాపుల||
1. యెరుషలేము క న్యలు కొందరు తన యెదుట వచ్చి యేడ్చుచు
సిలువన్ వరుస నప్పురికి వచ్చు నాశన గతు లెరుఁగఁ బలికి వా
రల నోదార్చెను ||బాపుల||
2. శత్రువు లటు తనుఁ జంపుచు నుండఁగ మైత్రిఁ జూపె సమ్మతి తోడన్
స్తోత్రముఁ జేసెను దండ్రీ వీరల దురిత మెల్ల క్షమి యింపవె
యనుచును ||బాపుల||
3. తన ప్రక్కను సిలు వను వేసిన యొక తస్కరుఁ డించుక వేఁడు కొనన్
కనికరము మన మునఁ బెనగొన ని చ్చెను మోక్షము తన తో
యుండుటగున్ ||బాపుల||
4. మితిలేని దురిత జీవుల లోపల మించి యున్న పతితుల కైనన్
హితముగ మోక్షం బిచ్చుటకై శో ణిత మిచ్చెను నా మతి కది సాక్షిగఁ
||బాపుల||
paapulayeda kree sthuni priya mettidhoa parikiMpare ka lvarigiripai
naapadhalanu dhana keegathiAO bettedu kaapuruShula dhesAO ganugonu krupathoa
||baapula||
1. yeruShlaemu ka nyalu koMdharu thana yedhuta vachchi yaedchuchu
siluvan varusa nappuriki vachchu naashana gathu leruAOgAO baliki vaa
rala noadhaarchenu ||baapula||
2. shathruvu latu thanuAO jMpuchu nuMdAOga maithriAO joope sammathi thoadan
sthoathramuAO jaesenu dhMdree veerala dhuritha mella kShmi yiMpave
yanuchunu ||baapula||
3. thana prakkanu silu vanu vaesina yoka thaskaruAO diMchuka vaeAOdu konan
kanikaramu mana munAO benagona ni chchenu moakShmu thana thoa
yuMdutagun ||baapula||
4. mithilaeni dhuritha jeevula loapala miMchi yunna pathithula kainan
hithamuga moakShM bichchutakai shoa Nitha michchenu naa mathi kadhi saakShigAO
||baapula||