ఆశ్చర్యకరుడా నా యేసయ్యా
దయచూపువాడవు నీవేనయ్యా
అద్భుతకరుడా నా యేసయ్యా
ప్రేమించువాడవు నీవేనయ్యా
నా ప్రార్ధనలన్నీ నీవు ఆలకించుమయ్యా
నా జీవితాన్ని అద్భుతంగా మార్చుమయ్యా
నీవే ప్రార్ధనలను ఆలకించువాడవు
నీవే జీవితాలను మార్చువాడవు
నా హృదయమును నూతనపరచుమయ్యా
ప్రతి దినము బాగుగా శుద్ధిచేయుమయ్యా
నీవే నూతనకార్యం చేయువాడవు
నీవే హృదయాన్ని శుద్ధి చేయువాడవు
లోక ఆశలపై విజయం దయచేయుమయ్యా
పరలోకమార్గంలో నన్ను నడిపించుమయ్యా
నీవే లోకాశలపై విజయమిచ్చువాడవు
నీవే పరలోకానికి నడిపించువాడవు
