ఊహ కందదయ్యా నీ కార్యము
Oohakandadayya Nee Karyamu
ఊహ కందదయ్యా నీ కార్యము
ఊహకుమించిన నీ కార్యము
జరిగించుచున్నావు నా బ్రతుకున
కృపచూపుచున్నావు దిన దినమున
1)అర్హతేలేదంటూ ఉనికినే ప్రశ్నిస్తూ
పురుగులా నను చూస్తూ మనసునే వేదిస్తూ
గేళిచేసే వేళ చూసిన యేసయ్యా
ఆదరించావయ్యా ఆదరణ కర్తగా
ఆశ్చర్యమే, అద్భుతమే నా యేసు నీ కార్యము
2)భారమే బ్రతుకంటూ ఒంటరయ్యానంటూ
ఓడిపోయానంటూ ఓదార్పు లేదంటూ
కృంగియున్నవేళ చూసిన యేసయ్యా
తోడైనావయ్యా నా కన్న తండ్రిలా
ఆశ్చర్యమే, అద్భుతమే నా యేసు నీ కార్యము
3) పగవాని ఎదుటే నాకు- క్రొవ్విన మాంసమునిచ్చి
కన్నీరు తుడిచి- తలగా నను చేసావంటూ
నాట్యమాడే వేళ చూసిన యేసయ్య
స్థిరపరిచావయ్యా నీ మహిమ పాత్రగా
ఆశ్చర్యమే, అద్భుతమే నా యేసు నీ కార్యము
