నీ ప్రేమ నాకు కావాలయ్యా
LYRICS:-ప్రేమలేని జీవితం నాది యేసయ్య
నీ కల్వరి ప్రేమలో నన్ను నింపవయ్యా
నీ ప్రేమ నాకు కావాలయ్యా
నీ స్నేహం నాకు కావాలయ్యా (2x)
యేసయ్య యేసయ్య
ప్రార్థనలేని హృదయం నాది యేసయ్య
నీ ప్రార్థనతో నన్ను నింపవయ్యా (2x)
నీ వాక్కులేని నా హృదయం
నీ వాక్యంతో నన్ను నింపవయ్యా
యేసయ్య యేసయ్య
నీ ప్రేమ నాకు కావాలయ్యా
నీ స్నేహం నాకు కావాలయ్యా (2x)
చీకటిలో ఉన్న నన్ను
నీ వెలుతురుతో నింపవయ్యా (2x)
ముల్లులాంటి జీవితం నాది యేసయ్య
నీ ప్రేమతో నా జీవితం పువ్వుగా మార్చవయ్యా
యేసయ్య యేసయ్య
నీ ప్రేమ నాకు కావాలయ్యా
నీ స్నేహం నాకు కావాలయ్యా (2x)
తల్లి ప్రేమలేని జీవితం నాది యేసయ్య
నీ కల్వరి ప్రేమతో నన్ను చేరదీసావయ్యా
తండ్రి స్నేహంలేని జీవితం నాది యేసయ్య (2x)
నీ స్నేహంతో నా జీవితాన్ని ధైర్యపరచావయ్యా
యేసయ్య యేసయ్య
నీ ప్రేమ నాకు కావాలయ్యా
నీ స్నేహం నాకు కావాలయ్యా (2x)
ఎవరితడు లేని జీవితం నాది యేసయ్య
నీ నీడలో నన్ను కాచావయ్యా
బంధువులే నా మనసును గాయపరచగా
నీ ప్రేమతో నా మనసును ఓదార్చావయ్యా (2x)
యేసయ్య యేసయ్య
నీ ప్రేమ నాకు కావాలయ్యా
నీ స్నేహం నాకు కావాలయ్యా (2x)
ప్రతిక్షణం శోధనలో గడిపిన జీవితం నాది
నీ నామములో నాకు విడుదల ఇచ్చావయ్యా
పలు చెడు అలవాట్లకు లోనయ్యానయ్యా
నీ రక్తంతో నన్ను కడిగి శుద్ధి పరిచావయ్యా (2x)
యేసయ్య యేసయ్య
నీ ప్రేమ నాకు కావాలయ్యా
నీ స్నేహం నాకు కావాలయ్యా (2x)
