నీ కృపయే నా జీవితము
Nee Krupaye Naa Jeevithamu
మరణ పడకలో నడవలేని స్థితిలో ఉన్న నన్ను అందరు విడిచిపెట్టేసిన సమయంలో దేవుని కృపయే నన్ను బ్రతికించింది,
నా జీవితములో మరొక ఆశీర్వాదమైన అధ్యాయంలోనికి నన్ను నడిపించింది.
యోగ్యతేలేని నా జీవితములో యేసయ్య ఎంతో గొప్ప కృప చూపి నన్ను సజీవ సాక్షిగా నిలబెట్టారు.
నా జీవిత సాక్ష్యమే ప్రభువు నా నోట ఉంచిన ఈ పాట...
ఈ పాట వినే ప్రతీ ఒక్కరి హృదయాలను దేవుడు ఆదరించి దేవుని మహా కృప వారి జీవితాలలో కూడా ఉన్నతంగా ఉంది అని గ్రహించి ప్రభువును మహిమ మరచాలని ప్రార్ధిస్తూ...
- సిస్టర్ శిరీషా గ్రేస్
ఎంత కృప చూపావు - యోగ్యతలేని నాపైన
ఏముంది నీ కృప తప్ప - నా జీవితములో యేసయ్య
నీ కృపయే – నా జీవితము
నీ కృపయే – నాకు ఆధారము
నీ కృపయే నీదు కృపయే - నాకు ఊపిరిని పొసేనయ్యా
నీ కృపయే నీదు కృపయే - నాకు చాలును యేసయ్య
1. నా దేహము క్షీణించి ఆఖరి సమయాన - మరణము తప్పించెనే
నీ కృపయే జీవముతో లేపెనే
కదలలేక నా అడుగు నడువలేని సమయాన – నన్ను బలపరిచెనే
నీ కృపయే అడుగులు స్థిరపరిచెనే
ఊపిరి ఉందంటేనే నీ కృపయే
చాలయ్య నా దేవా నీ కృపయే
2. నా హృదయము గాయముతో కృంగిన సమయాన – నన్ను ఓదార్చేనే
నీ కృపయే గాయమును మాన్పేనే
ఆశల నా దీపం ఆరిన సమయాన – నన్ను దర్శించేనే
నీ కృపయే నన్ను వెలిగించేనే
నాకున్న నా ధైర్యం నీ కృపయే
చాలయ్యా నా దేవా నీ కృపయే
నాకున్న నాధైర్యం నీ కృపయే
చాలయ్య నా దేవా నీ కృపయే
3. పాడలేక నా స్వరము ఆగిన సమయాన –
ఆత్మీయ గీతముతో
నీ కృపయే స్తుతిచేయు కృపనిచ్చెనే
తల్లి గర్భములో రూపింపక మునుపే – నన్ను పిలిచితివే
నీ కృపతో సేవలో నిలిపితివే
చావైనా బ్రతుకైనా నీ సేవనే
నీ కృపతో చేసేదను నా యేసయ్య
