ముందుకే వెళ్లెదను
నీ ఆత్మతో నన్ను నడుపుమయ్యా
నీ చేతి నీడలో నిత్యము నన్ను కావుమా
నీ సేవను కొనసాగించే భాగ్యమియ్యుమా।।
1) అవమానమెదురైన గాయపరచాబడిన
నిందలెన్నో వేసిన చిన్న చూపే చూసిన (2)
నా వెన్ను తట్టి కన్నీరు తుడచి విశ్వాసం బలపరచావు (ఎదిగించావు) (2)
।।ముందుకే వెళ్లెదను।।
2) ఎంతగానో నమ్మిన వారే మోసం చేసిన
నా వెంటే ఉన్నానంటు నా పక్షం లేకున్నాను (2)
నే నీకు లేనా ? నేను సరిపోనా ?? అని నన్ను బలపరచావు (నడీపించావు) (2)
నీ ఆత్మతో నన్ను నడుపుమయ్యా
నీ చేతి నీడలో నిత్యము నన్ను కావుమా
నీ సేవను కొనసాగించే భాగ్యమియ్యుమా।।
