దూతలు దిగివచ్చే
Doothalu Digivache
దూతలు దిగివచ్చే భువిలో - ప్రభువుని స్తుతియింపా (2)
కాంతులు వెదజల్లే దివిలో - తారకొటఉదయించే(2)
మనకై ప్రభువే దీనుడై ఉదయించే (2)
మహిమ ఘనతయు - ప్రభుకే చెల్లునూ (2)
ఘనుడగు దేవుడు తన ప్రియ సుతుని
మన రక్షణకై పంపించెను (2)
ఇట్టి రీతిగా దేవుడు
ప్రేమ చూపించెన్ (2)
మహిమ ఘనతయు - ప్రభుకే చెల్లునూ (2)
పరమును వదిలి భాగ్యము విడిచి
రిక్తునిగా తగ్గించుకొనెన్ (2)
ఇట్టి రీతిగా ప్రభువు
భువికి ఏతెంచెన్ (2)
మహిమ ఘనతయు - ప్రభుకే చెల్లునూ (2)
