క్రీస్తుజన్మించె నేడు కాంతి ఉదయించెనే
Santhosha Sambarame
క్రీస్తుజన్మించె నేడు - కాంతి ఉదయించెనే
మహిమ విడిచొచ్చినాడు - మనిషిగా పుట్టెనే
మరణాంధకారమందు - మహిమను నింపుటకు
మనవంటి వాడాయెను - మనసున్న మహారాజు
"సంతోష సంబరమే - శాశ్వత ఆనందమే "
1.ప్రవచనములు నెరవేరునట్లు - పుడమిలో పుట్టెను
కన్యమరియ గర్భమునందు - శిశువై జన్మించెను
వెలుగు విరజిమ్ముచూ - భ్రమలు తొలగించగా
ఇలకు అరుదెంచెను - దైవకుమారుడు యేసుక్రీస్తుగా
2.సర్వోన్నతమగు స్థలములయందు - దేవునికే మహిమ అనుచూ
దూతలందరు నింగిలో చేరి - ఆరాధన చేసిరి
మనమందరము చేరి - స్తుతులు అర్పించెదం
రాజులకు రాజని -క్రొత్త కీర్తనలు పాడి కీర్తించెదము
