కోత విస్తారమేగాని పనివారు కొద్దిగా ఉన్నారు
Parisaraana Sasyamantha Hymnal
కోత విస్తారమేగాని పనివారు కొద్దిగా ఉన్నారు
గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడు కొనుడని తన శిష్యులతో చెప్పెను.
కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను కృతజ్ఞతాస్తుతులతో నేనాయనను ఘనపరచెదను
శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీయెడల కృప చూపుచున్నాను.
Album: పరిసరాన సస్యమంత (FAR AND NEAR FIELDS ARE TEAMING)
1. పరిసరాన సస్యమంత
పండె పనల నిండను
పసిడి వర్ణ మలరునట్లు దేశమంత నిండెను
||కోఁతప్రభువా కోయువారం
బంపుమాదు మొఱవిని
పనలఁగూర్చిఁ బంపువారిఁ
గోఁతసమయమప్పుడే ||
2. ప్రాతఃకాల ప్రజ్వలమున
సాయంకాల కాంతులన్
సంధ్యరాగ సమయమపుడు కూర్పన్ ఆనతీయుము ॥కోత॥
3. ప్రభువు పంపు వారలార
పసిడి పనలఁ కూర్చుఁడి ప్రొద్దు గ్రుంకు వేళమీరు
పరముఁజేరు కొనెదరు ॥కోత॥
జె. ఒ. థామ్సన్
అను : కొల్లపు గోపాలరావు
