ennaodu gaamchedhamoa yaesuni ఎన్నఁడు గాంచెదమో యేసుని నెన్నఁ
Chords: ragam: ముఖారి-mukhaari
ఎన్నఁడు గాంచెదమో యేసుని నెన్నఁడు గాంచెదమో యెన్నఁడు
జూతుము కన్నె కుమారుని సన్నుతి జేయుచును ||నెన్నఁడు||
1. అంధుల గాచె నఁట యెహోవా నందనుఁ డితఁడౌనట పొందుగఁ
బాపాత్ములకొర కై తన ప్రాణము విడిచెనఁట ||యెన్నఁడు||
2. వేసిరి సిలువనఁట క్రీస్తుని జేసిరి హేళనఁట డాసిరి యూదులఁట
బల్లెము దూసిరి ప్రక్కనఁట ||యెన్నఁడు||
3. చిందెను రక్తమఁట పరమ సంధులు దెల్పెనఁట నిందల కోర్చె నఁ
ట మన దగు నేరము గాచెనఁట ||యెన్నఁడు||
4. ఆపద కోర్చెనఁట పాపపు మోపులు మోసెనఁట కోపము మాన్పెనఁ
ట యెహోవా కొడుకై వెలసెనఁట ||యెన్నఁడు||
5. అక్షయుఁ డితఁడెనఁట జగతికి రక్షకుఁ డాయెనఁట దీక్షగ నమ్మిన
నరులం దరికి ని రీక్షణ దేవుఁడఁట ||యెన్నఁడు||