• waytochurch.com logo
Song # 29894

యూదుల రాజుగ


యూదుల రాజుగ పుట్టినవానిని - చూతము రారండి పాపుల రక్షకుడేసు ప్రభువని - చాటగ రారండి

ప్రవక్తలు అందరూ - ప్రవచించిన రక్షకుని
ఆదికంటే ముందు ఉన్న వాక్యమైన దేవుని

ఆ.ప..కళ్ళారా - కళ్ళారా
కళ్ళారా మనమందరము - చూచితరించను ఇమ్మానుయేలుగా - అవతరించెను Happy Christmas - Merry Christmas

వంకర త్రోవలు - తిన్నగ చేయును
ఎత్తు పల్లాలను - సమముగ చేయును
చీకటి బ్రతుకుల్లో - వెలుగును నింపును హితవత్సరమును - యిల ప్రకటించును
మతము దేనిని - చేయకపోయెను
యేసు దానిని చేసెను
వ్రతముల వల్ల కాని కార్యము
శిలువ యాగములో - నెరవేర్చెను
ఆ.ప..కళ్ళారా - కళ్ళారా
కళ్ళారా మనమందరము - చూచితరించను
ఇమ్మానుయేలుగా - అవతరించెను Happy Christmas - Merry Christmas
బంగరు బోళము - సాంబ్రాణి తెచ్చి
ముగ్గురు జ్ఞానులు - ఆరాధించిరి
యేసును చూచిన వెంటనే జ్ఞానులు
పాత మార్గమునుండి - మళ్లించబడిరి
క్రిస్మస్ అంటే - సందడి కాదు
దైవ సందర్శనని ఎరుగు
ఇళ్లు గుళ్ళు - వెలుగుటకంటే
మదినిండాలి - యేసుని వెలుగు
ఆ.ప..కళ్ళారా - కళ్ళారా కళ్ళారా మనమందరము - చూచితరించను ఇమ్మానుయేలుగా - అవతరించెను Happy Christmas - Merry Christmas.


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No
  • Song youtube video link :
    Copy sharelink from youtube and paste it here

© 2025 Waytochurch.com