saakshyamichcheda సాక్ష్యమిచ్చెద మన స్వామి యేసు దేవుడంచు
సాక్ష్యమిచ్చెద మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను దెల్పుటయే సాక్ష్య మిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించె నంచు ||సాక్ష్య||దిక్కు దెసయు లేని నన్ను దేవుడెంతో కనికరించి మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతి నిచ్చినడో ||సాక్ష్య||పల్లెటూళ్ళ జనుల రక్షణ భారము నా పైని గలదు పిల్లలకును బెద్దలకును బ్రేమతో నా స్వానుభవము ||సాక్ష్య||బోధ చేయలేను వాద ములకు బోను నాక దేల నాధు డేసు ప్రభుని గూర్చి నాకు దెలసినంత వరకు ||సాక్ష్య||పాపులకును మిత్రుడంచు బ్రాణ మొసగి లేచెనంచు బాపముల క్షమించు నంచు బ్రభుని విశ్వసించు డంచు ||సాక్ష్య||చోరు లైన జారు లనా చారు లైన నెవ్వరైన ఘోరపాపు లైన క్రీస్తు కూర్మితో రక్షించు నంచు ||సాక్ష్య||పరమత దూషణము లేల పరిహసించి పలుకు టేల ఇరుగు పొరుగు వారి కెల్ల యేసు క్రీస్తు దేవు డంచు ||సాక్ష్య||ఎల్లకాల మూరకుండ నేల యాత్మ శాంతి లేక తల్లడిల్లు వారలకును తండ్రి కుమా రాత్మ పేర ||సాక్ష్య||
Saakshyamichcheda Mana Swaami Yesu Devu Danchu Saakshyamanaga Ganina Vinina Sangathulanu Delputaye Saakshya Michchu Koraku Nannu Swaami Rakshinche Nanchu ||Saakshyamichcheda||Dikku Desayu Leni Nannu Devudentho Kanikarinchi Makkuvatho Naaku Netlu Manashshaanthi Nichchinado ||Saakshyamichcheda||Palletoolla Janula Rakshana Bhaaramu Naa Paini Galadu Pillalakunu Beddalakunu Brematho Naa Swaanubhavamu ||Saakshyamichcheda||Bodha Cheyalenu Vaada Mulaku Bonu Naaka Dela Naadhu desu Prabhuni Goorchi Naaku Delasinantha Varaku ||Saakshyamichcheda||Paapulakunu Mithrudanchu Braana Mosagi Lechenanchu Baapamula Kshaminchu Nanchu Brabhuni Vishwasinchu Danchu ||Saakshyamichcheda||Choru laina Jaaru lanaa Chaaru laina Nevvaraina Ghorapaapu laina Kreesthu Koormitho rakshinchu Nanchu ||Saakshyamichcheda||Paramatha Dooshanamu Laela Parihasinchi Paluku Taela Irugu Porugu Vaari kella Yesu Kreesthu Devu Danchu ||Saakshyamichcheda||Ellakaala Moorakunda Nela Yaathma Shaanthi Leka Thalladillu Vaaralakunu Thandri Kumaa Raathma Pera ||Saakshyamichcheda||