siluvaloa vraelaadu prabhuvae సిలువలో వ్రేలాడు ప్రభువే విలువ
సిలువలో వ్రేలాడు ప్రభువే విలువ కందఁగ రాని యీవుల నెలమి
మనకై కొనియెఁగల్వరి నిపుడు సాష్టాంగము లొనర్చుచు ||సిలువ||
1. కొరత చావయినను మరణము వఱకుఁదనుఁ దగ్గించుకొని మన కొఱకు
దాసుండగుచు రిక్తుని కరణి నిట జీవము నొసంగెడు ||సిలువ||
2. తనను నమ్మినవారు చావక యనిశ జీవమునొంది బతుకను దన
స్వపుత్రుని నిచ్చునంతఁగఁ దండ్రి ప్రేమించెను జగంబును ||సిలువ||
3. పాప మెఱుగని వాని మనకై పాపముఁగ నొనరించి దేవుఁడు
శాపగ్రస్తులలోన నొకఁడుగ మా ప్రభుండెంచంగఁ బడియెను ||సిలువ||
4. లోకమాంస పిశాచులని యెడి భీకారుల పొంగుఁ గృంగను శ్రీ కరుఁ
డు మన దేవతనయుం డౌ కృపానిధి దీనుడయ్యెను ||సిలువ||
5. ఘోరయుద్ధముఁ జేసివైరిని గూలఁద్రోసిన తావిదే మన పారమార్ధిక
బలము కిరువగు ధీర శ్రేష్ఠుఁడు దిశలు ఘళ్లన ||సిలువ||
దేశ మిత్తు నని శ్రీకరుం డెహోవా సెలవిచ్చెను ||దశమ||
6. శరణు గలదిఁక పాపకోటికి స్వామి ద్రోహపు శత్రులకు సహ కరుణ
రుధిర కణాగతంబున కలుష రహిత మనంత రక్షణ ||సిలువ||
7. మాకు ప్రేమ సారమయ్యెను మాకు జీవనాధారమయ్యెను మాకుఁ
దృప్తి సునీరమయ్యెను మాకుఁ బరమ విచారమయ్యెను ||సిలువ||
8. నమ్ముదము సైన్యముల ప్రభువును చిమ్ముదము సందియము లాత్మను
క్రమ్ముదము మోక్షపురి బాట సు ఖమ్ము మన హృదయమ్ము లొందను ||సిలువ||
siluvaloa vraelaadu prabhuvae viluva kMdhAOga raani yeevula nelami
manakai koniyeAOgalvari nipudu saaShtaaMgamu lonarchuchu ||siluva||
1. koratha chaavayinanu maraNamu vaRakuAOdhanuAO dhaggiMchukoni mana koRaku
dhaasuMdaguchu rikthuni karaNi nita jeevamu nosMgedu ||siluva||
2. thananu namminavaaru chaavaka yanisha jeevamunoMdhi bathukanu dhana
svaputhruni nichchunMthAOgAO dhMdri praemiMchenu jagMbunu ||siluva||
3. paapa meRugani vaani manakai paapamuAOga nonariMchi dhaevuAOdu
shaapagrasthulaloana nokAOduga maa prabhuMdeMchMgAO badiyenu ||siluva||
4. loakamaaMsa pishaachulani yedi bheekaarula poMguAO gruMganu shree karuAO
du mana dhaevathanayuM dau krupaaniDhi dheenudayyenu ||siluva||
5. ghoarayudhDhamuAO jaesivairini goolAOdhroasina thaavidhae mana paaramaarDhika
balamu kiruvagu Dheera shraeShTuAOdu dhishalu ghaLlana ||siluva||
dhaesha miththu nani shreekaruM dehoavaa selavichchenu ||dhashama||
6. sharaNu galadhiAOka paapakoatiki svaami dhroahapu shathrulaku saha karuNa
ruDhira kaNaagathMbuna kaluSh rahitha manMtha rakShNa ||siluva||
7. maaku praema saaramayyenu maaku jeevanaaDhaaramayyenu maakuAO
dhrupthi suneeramayyenu maakuAO barama vichaaramayyenu ||siluva||
8. nammudhamu sainyamula prabhuvunu chimmudhamu sMdhiyamu laathmanu
krammudhamu moakShpuri baata su khammu mana hrudhayammu loMdhanu ||siluva||