ప్రభువా దృష్టించుము నాకు ఇబ్బంది కలిగెను
ప్రభువా దృష్టించుము నాకు ఇబ్బంది కలిగెను
ప్రభువా నా అంతరంగము క్షోబిల్లుచున్నది
ప్రభువా దృష్టించి చూడుము
నా గుండె నాలోపల కొట్టుకొనుచున్నది
నన్ను ఆదరించు వాడోకడును లేడాయెను
నన్ను ఆదరించుము నా యేసయ్యా
నన్ను ఆదరించుము నా యేసయ్యా
ప్రభువా దృష్టించుము నాకు ఇబ్బంది కలిగెను
ప్రభువా నా అంతరంగము క్షోబిల్లుచున్నది
ప్రభువా దృష్టించి చూడుము
నేను బహుగా నిట్టూర్పులు విడుచుచున్నాను
నా మనస్సు కృంగిపోయెను
నా మనసును లేవనెత్తుము యేసయ్యా
నా మనసును లేవనెత్తుము యేసయ్యా
ప్రభువా దృష్టించుము నాకు ఇబ్బంది కలిగెను
ప్రభువా నా అంతరంగము క్షోబిల్లుచున్నది
ప్రభువా దృష్టించి చూడుము
నా కన్నులు కన్నీటి చేత క్షీణించుచున్నవి
నా కంటి పాపను విశ్రమింపనీయక
నీ సన్నిధిలో నా హృదయమును కుమ్మరించెదను
నీ సన్నిధిలో నా హృదయమును కుమ్మరించెదను
ప్రభువా దృష్టించుము నాకు ఇబ్బంది కలిగెను
ప్రభువా నా అంతరంగము క్షోబిల్లుచున్నది
ప్రభువా దృష్టించి చూడుము
ప్రభువా నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు
కృపయు వాత్సల్యత గల దేవుడవు
దయ చూపు దేవుడవు నిరీక్షణ ఆధారము నీవే
దయ చూపు దేవుడవు నిరీక్షణ ఆధారము నీవే
ప్రభువా దృష్టించుము నాకు ఇబ్బంది కలిగెను
ప్రభువా నా అంతరంగము క్షోబిల్లుచున్నది
ప్రభువా దృష్టించి చూడుము