యేసు జన్మపు దినంబు ఎంతో మోదమిచ్చుగా
Yesu Janmapu Dinambu
యేసు జన్మపు దినంబు -ఎంతో మోదమిచ్చుగా క్రీస్తు వారిదౌ మనంబు - లుల్లసం బొందుచుండున్ గదా స్వామికౌ ఘనంబు పైన - నరాళీకిన్ గటాక్ష మౌ నిహానా బేత్లెహేమునందు యేసు నేడు - పుట్టినాడంచు గీర్తింపుడు 1. దీపముల్ వెలుంగు చెట్టు - మళ్ళీ కానిపించె నీ వింత వెల్గు భావ మెట్టు - లెంచ నౌ నయ్య ఈ భూమిని స్వామికౌ ఘనంబు పైన - నరాళీకిన్ గటాక్ష మౌ నిహానా బేత్లెహేమునందు యేసు నేడు – పుట్టి నాడంచు గీర్తింపుడు 2.ఈ వెలుంగు లారిపోను -ఈ ముదంబు కొంచమే యేసు చే బరంబులోను - కల్గు నిత్యంపు సంతోషమే స్వామికౌ ఘనంబు పైన - నరాళీకిన్ గటాక్ష మౌ నిహానా బేత్లెహేమునందు యేసు నేడు – పుట్టి నాడంచు గీర్తింపుడు 3.ముద్దు బిడ్డ యేసు నేత -మా మనంబులో నీ వెల్గు నుంచి దానిచేత -నీదు చెంతన్ తుదిన్ చేరనీస్వామికౌ ఘనంబు పైన- నరాళీకిన్ గటాక్ష మౌ నిహానా బేత్లెహేమునందు యేసు నేడు – పుట్టి నాడంచు గీర్తింపుడు
