enni thalachina ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే
పల్లవి: ఎన్ని తలచినా - ఏది అడిగినా - జరిగేది నీ చిత్తమే ఎన్ని తలచినా - ఏది అడిగినా - జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ వాక్కుకై - వేచి యుంటిని - నా ప్రార్ధన ఆలకించుమా ప్రభువా - నా ప్రార్ధన ఆలకించుమా 1. నీ తోడు లేక - నీ ప్రేమ లేక - ఇలలోన ఏ ప్రాణి నిలువ లేదు నీ తోడు లేక - నీ ప్రేమ లేక - ఇలలోన ఏ ప్రాణి నిలువ లేదు అడవి పూవులే - నీ ప్రేమ పొందగా - అడవి పూవులే - నీ ప్రేమ పొందగా నా ప్రార్ధన ఆలకించుమా - ప్రభువా నా ప్రార్ధన ఆలకించుమా 2. నా ఇంటి దీపం - నీవే అని తెలిసి - నా హృదయం నీ కొరకు పదిల పరచితి నా ఇంటి దీపం - నీవే అని తెలిసి - నా హృదయం నీ కొరకు పదిల పరచితి ఆరిపోయిన నా వెలుగు దీపము - ఆరిపోయిన నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో - ప్రభువా వెలిగించుము నీ ప్రేమతో 3. ఆపదలు నన్ను - వెన్నంటియున్న - నా కాపరి నీవై నన్ను ఆదుకొంటివి ఆపదలు నన్ను - వెన్నంటియున్న - నా కాపరి నీవై నన్ను ఆదుకొంటివి లోకమంతయు నన్ను విడిచినా - లోకమంతయు నన్ను విడిచినా నీ నుండి వేరు చేయవు - ప్రభువా నీ నుండి వేరు చేయవు ఎన్ని తలచినా - ఏది అడిగినా - జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే