యేసు నా సొంతమై
Smyrna paul k
యేసు నా సొంతమై - నేను ప్రభు సొంతమై
ఈ అనుబంధం నిలవాలయ్య - నీ రాకకై సాగాలిలా
అ.ప. యేసయ్య నా యేసయ్య
1. దివారాత్రులు నాకై నీవు - వేచి చూచితివే
చెదరిన నాపై బాహువు చాపి - చేరదీసితివే
నిన్ను విడిచి ఉండలేను - నీవు లేక నేనే లేను
2. నాకు కలిగిన బాధలన్నిట - తోడు నిలిచితివే
కృంగియున్న నన్ను లేపి - కృపలో దాచితివే
నీకు దూరమై ఉండలేను - నీవు లేక నేనే లేను
3. నేను నీపై ఆనుకొనగా - ఆదరించితివే
భారమైన నాదు కాడిని - నీవే మోసితివే
నిన్ను మరచి ఉండలేను - నీవు లేక నేనే లేను
