mahaathmuaodaina naa prabhu vichithra మహాత్ముఁడైన నా ప్రభు విచిత్ర
1. మహాత్ముఁడైన నా ప్రభు
విచిత్ర సిల్వఁ జూడ నా
యాస్తిన్ నష్టంబుగా నెంచి
గర్వం బణంగఁ ద్రొక్కుదున్.
2. నీ సిల్వ గాక యో దేవా
దేనిన్ బ్రేమింప నీయకు
నన్నాహరించు సర్వమున్
నీ సిల్వకై త్యజింతును.
3. శిరంబు పాద హస్తముల్
నూచించు దుఃఖ ప్రేమలు
మరెన్నడైన గూడెనా
విషాదప్రేమ లీ గతిన్?
4. ముండ్లన్ దుర్మార్గులల్లిన
కిరీట మేసు కుండినన్
ఈ భూకిరీటములన్నీ
దానం దూగంగఁ జాలు నే?
5. లోకంబు నే నర్పించిన
నయోగ్యమైన యీవి యౌ
వింతైన యేసు ప్రేమకై
నా యావజ్జీవ మిత్తును.
6. రక్షింపఁ బడ్డ లోకమా
రక్షింపఁ జావుఁ బొందిన
రక్షకుఁ డేసునిన్ సదా
రావంబుతోడఁ గొల్వుమా
1. mahaathmuAOdaina naa prabhu
vichithra silvAO jooda naa
yaasthin naShtMbugaa neMchi
garvM baNMgAO dhrokkudhun.
2. nee silva gaaka yoa dhaevaa
dhaenin braemiMpa neeyaku
nannaahariMchu sarvamun
nee silvakai thyajiMthunu.
3. shirMbu paadha hasthamul
noochiMchu dhuHkha praemalu
marennadaina goodenaa
viShaadhapraema lee gathin?
4. muMdlan dhurmaargulallina
kireeta maesu kuMdinan
ee bhookireetamulannee
dhaanM dhoogMgAO jaalu nae?
5. loakMbu nae narpiMchina
nayoagyamaina yeevi yau
viMthaina yaesu praemakai
naa yaavajjeeva miththunu.
6. rakShiMpAO badda loakamaa
rakShiMpAO jaavuAO boMdhina
rakShkuAO daesunin sadhaa
raavMbuthoadAO golvumaa