siluvanu moasithivaa naa korakసిలువను మోసితివా నా కొఱకై కలువ
సిలువను మోసితివా నా కొఱకై కలువరి మెట్టపైకి సిలువ నా
యాత్మలోఁ బలుమాఱు దలఁపఁగాఁ దాలిమి లేదాయెను హా యీ
జాలికి మారుగా నేనేమి సేయుదు ప్రేమను మరువఁజాల ||సిలువ||
1. ఘోరమైనట్టి యీ భారమైన సిలువ ధరియించి భుజముపైని నా
దురితముల్ బాపను కరుణచేఁ జనుదెంచి మరణము నొందితివా ||సిలువ||
2. కలువరి మెట్టపైఁ కాలు సేతు లెల్ల చీలలతోఁ గ్రుచ్చిపట్టి యా
సిలువకుఁ గొట్టఁగ విలువైన నీ మేని రక్తము ప్రవహించెనా ||సిలువ||
3. మెట్టపైన నిన్నుఁ పెట్టిన బాధ నేఁ బట్టి తలంపఁగను ఆహా పట్టైన
నీ ప్రేమ నెట్టుల మఱతును కష్టముల్ గలిగినను ||సిలువ||
4. పంచగాయములను నెంచి యాత్మలోన నుంచి తలంపఁగను హానా
మించిన దురితముల్ ద్రుంచి నన్నెంచిర క్షింపవచ్చెను భూమికి ||సిలువ||
siluvanu moasithivaa naa koRakai kaluvari mettapaiki siluva naa
yaathmaloaAO balumaaRu dhalAOpAOgaaAO dhaalimi laedhaayenu haa yee
jaaliki maarugaa naenaemi saeyudhu praemanu maruvAOjaala ||siluva||
1. ghoaramainatti yee bhaaramaina siluva DhariyiMchi bhujamupaini naa
dhurithamul baapanu karuNachaeAO janudheMchi maraNamu noMdhithivaa ||siluva||
2. kaluvari mettapaiAO kaalu saethu lella cheelalathoaAO gruchchipatti yaa
siluvakuAO gottAOga viluvaina nee maeni rakthamu pravahiMchenaa ||siluva||
3. mettapaina ninnuAO pettina baaDha naeAO batti thalMpAOganu aahaa pattaina
nee praema nettula maRathunu kaShtamul galiginanu ||siluva||
4. pMchagaayamulanu neMchi yaathmaloana nuMchi thalMpAOganu haanaa
miMchina dhurithamul dhruMchi nanneMchira kShiMpavachchenu bhoomiki ||siluva||