• waytochurch.com logo
Song # 30135

పరిపూర్ణుడా నాయేసయ్యా

paripoornuda na yessaiah


ప. పరిపూర్ణుడా నా యేసయ్యా
నీవే పరిశుద్ధుడవు నీకే వందనం .. 2..
ఆత్మనాధుడా ఆరాధించెదా
ఆత్మతో సత్యముతోను .. 2..
.. పరిపూర్ణుడా..

1. విరిగి నలిగిన మనసే
నీకిఇష్టమైన బలిదేవా .. 2..
విరిగి నలిగిన హృదయమును
నీవు అలక్ష్యము చేయవయ్యా .. 2..
నీవు అలక్ష్యము చేయవయ్యా
..పరిపూర్ణుడా..

2. సాతాను తంత్రములన్నిటిని
ఎదిరించే బలము నిమ్మయా .. 2..
సర్వాంగ కవచము ధరింపజేసి
నీ చిత్తములో నన్ను నడిపించయ్యా .. 2..
నీ చిత్తములో నన్ను నడిపించయ్యా
..పరిపూర్ణుడా..

3. నిన్నే ప్రార్థించుచున్నానయ్యా
నన్ను మరువకు నా తండ్రీ .. 2..
నీదు దయను సత్యమును
నన్ను విడిచి పోనియ్యకు .. 2..
నన్ను విడిచి పోనియ్యకు..
..పరిపూర్ణుడా..


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No
  • Song youtube video link :
    Copy sharelink from youtube and paste it here

© 2025 Waytochurch.com