• waytochurch.com logo
Song # 30141

ఆశ్రయం నీవే యేసయ్యా ఆధారం నీవే మెస్సయ్యా

asayam neeve yessaiah adharam neve messaiah


ఆశ్రయం నీవే యేసయ్యా
ఆధారం నీవే మెస్సయ్యా
బలమైన కోటవు నీవెగా
Alpha Omega నీవయ్యా

పాడెదము స్తుతి గానము
చేసెదము స్తోత్రార్పణము |2|
హల్లెలూయా హల్లెలూయా
స్తోత్రము స్తుతి స్తోత్రము |2| ||ఆశ్రయం నీవే||

1) యుద్ధములలో నాతో ఉంటివి
శత్రువులపై జయము నిచ్చితివి |2|
నా జయధ్వజము నీవెగా
యెహోవా నిస్సీ - నా జయము |2|
||హల్లెలూయా||

2) అక్కరలలో నాకు సహాయము
శ్రమలలో నాకు ఓదార్పు |2|
నా పోషణాధారము నీవెగా
యెహోవా యీరే - నా సమృద్ధి |2|
||హల్లెలూయా||

3) నా రోగములను బాగు చేసితివి
బలహీనతలో బలము ఇచ్చితివి |2|
పరమ వైద్యుడవు నీవెగా
యెహోవా రాఫా - నా స్వస్థత |2|
||హల్లెలూయా||

4) కలతలలో నాకు నెమ్మది
బాధలలో నాకు ఆదరణ |2|
నా సమాధానము నీవెగా
యెహోవా షాలోం - నా శాంతి |2|
||హల్లెలూయా||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No
  • Song youtube video link :
    Copy sharelink from youtube and paste it here

© 2025 Waytochurch.com