కలతలేని నీదు ప్రేమ
kalataleni nidu prema
కలతలేని నీదు ప్రేమ కరుణమయుడా ఓ ప్రభో
కరములెత్తి స్మరించెద నా జీవితంలో నిన్ను ప్రభో
నా జీవితంలో నిన్ను ప్రభో |2|
1 నేనెన్నడైనా నోరు తెరచి నిన్ను పిలువక పోతిని (2)
నీ మాట వినకపోతిని
తలుపు చెంతను నిలువగా నీ శిరము వానకు తడవగా
నా పడక దిగిరాపోతిని - నా తలుపు తీయకా యుంటిని |కలతలేని |
2 గోతిలో పడిపోతిని ఎవరాదరించక పోయిరి (2)
నజరేయుడేసే నన్ను చూచి గోతి నుండి లేపెను
పరలోకముందని చెప్పెను |2| |కలతలేని|
3 కొండ సందున గుండె బాధతో అంగలార్చుచుంటిని (2)
ఏడ్చి ఏడ్చి నిన్ను అడిగితే హస్తముతో నన్ను తాకెను
తన రక్తముతో నన్ను కడిగెను |2| |కలతలేని|
4 కరువులు కష్టములు శ్రమలు బాధలెన్ని కలిగిన (2)
నిన్ను విడువను కన్నతండ్రి సిలువ నెత్తుకు సాగేదా
ఆ సిలువ నెత్తుకు సాగేద |2| |కలతలేని|
