sarva loaka sm poojyaa namoanamoa sarvసర్వ లోక సం పూజ్యా నమోనమో సర్వ
Chords: ragam: శంకరాభరణము-shMkaraabharaNamu
1. సర్వ లోక సం పూజ్యా నమోనమో సర్వ జ్ఞాన సంపూర్ణా నమోనమో
సర్వ సత్య సారాంశా నమోనమో దేవా గావో ||
2. దీన భక్త మందారా నమోనమో దోష శక్తి సంహారా నమోనమో
దేవా యేసావతార నమోనమో దేవా గావో ||
3. దేవలోక ప్రదీపా నమోనమో భావలోక ప్రతాపా నమోనమో
పావనాత్మ స్వరూపా నమోనమో దేవా గావో ||
4. వేదవాక్యాదర్శ మీవె నమోనమో వేద జీవమార్గం బీవె నమోనమో
వేదవాక్కును నీవే నమోనమో దేవా గావో ||
5. శాపగ్రహివైతివి నాకై నమోనమో ప్రాణత్యాగివైతివి. నాకై నమోనమో
ప్రాయశ్చిత్తమైతివి నాకై నమోనమో దేవా గావో ||