• waytochurch.com logo
Song # 3022

vmdhanamayyaa yaesu neeku vmdhవందనమయ్యా యేసు నీకు వందనమయ్యా


Chords: ragam: శంకరాభరణము-shMkaraabharaNamu

వందనమయ్యా యేసు నీకు వందనమయ్యా మా కోరిక లందియ్య
వయ్యా వందనమయ్య నీ సుందర పాదార విందములకు భక్తి వినతులు
గావింతు సందియంబులులేని పరమానందమున నీయందు డెందము
పొందుపడఁ జేయవె యెహోవా నందనా పాపేంధనాగ్ని ||వందనమయ్యా||

1. నర దైవత్వములు రెండుగూడి పరిపూర్ణమైన దేహాత్మలు ధరియించి
యందు లేశంబయిన దురితంబులేని యవతారము నెరవుగా దాల్చి
ధరణికి నేతెంచి నిరయార్హూలగు సర్వ నరుల రక్షింప నీ కరుణా ప్రవాహము
విరివిగా పరుగెత్తఁ జేయుచు విమలమగు నీ ప్రాణరక్తము లరుదుగా
సమర్పణము ,చేసియు తిరిగి లేచితివో మహా ప్రభూ ||వందనమయ్యా||


2. నీ పుణ్యమందు నమ్ముకొనెడి యే పాపియైన తక్షణమున శాపంబుఁ
బాసి త్రాణగలిగి నీ సజ్జనుండు కృపవానిని కాపాడుచుండు
దీపించు భవ దీయ దివ్య వాగ్దత్తంబు లాపత్పరంపరల కడ్డుపడుచు నుండి
నీ వయిందన భారమెల్లను మోపి యోపికనుండ నేర్చిన
పాపిపుణ్యండగుచు నాత్మను భవ్య సుఖ మఖిలంబుఁబడయును
||వందనమయ్యా||


3. శమదమ ప్రేమ కృపా వినయ సద్గుణములనెడి భూషణముల
నిమిడియున్నట్టి తనువు దాల్చి క్రమముగానందు దైవత్వము
కనుపఱచినావు విమలోపదేశముల్ వివిధంబుగా శిష్య సముదయమునకు
నుత్తముగా బోధించి యమిత పాపహరంబునకు భువినవతరించిన మేను
సిలువను శ్రమను మృతికల్పించి మృత్యువుఁజంపి జీవించిన మహాత్మా
||వందనమయ్యా||

vMdhanamayyaa yaesu neeku vMdhanamayyaa maa koarika lMdhiyya
vayyaa vMdhanamayya nee suMdhara paadhaara viMdhamulaku bhakthi vinathulu
gaaviMthu sMdhiyMbululaeni paramaanMdhamuna neeyMdhu deMdhamu
poMdhupadAO jaeyave yehoavaa nMdhanaa paapaeMDhanaagni ||vMdhanamayyaa||

1. nara dhaivathvamulu reMdugoodi paripoorNamaina dhaehaathmalu DhariyiMchi
yMdhu laeshMbayina dhurithMbulaeni yavathaaramu neravugaa dhaalchi
DharaNiki naetheMchi nirayaarhoolagu sarva narula rakShiMpa nee karuNaa pravaahamu
virivigaa parugeththAO jaeyuchu vimalamagu nee praaNarakthamu larudhugaa
samarpaNamu ,chaesiyu thirigi laechithivoa mahaa prabhoo ||vMdhanamayyaa||


2. nee puNyamMdhu nammukonedi yae paapiyaina thakShNamuna shaapMbuAO
baasi thraaNagaligi nee sajjanuMdu krupavaanini kaapaaduchuMdu
dheepiMchu bhava dheeya dhivya vaagdhaththMbu laapathparMparala kaddupaduchu nuMdi
nee vayiMdhana bhaaramellanu moapi yoapikanuMda naerchina
paapipuNyMdaguchu naathmanu bhavya sukha makhilMbuAObadayunu
||vMdhanamayyaa||


3. shamadhama praema krupaa vinaya sadhguNamulanedi bhooShNamula
nimidiyunnatti thanuvu dhaalchi kramamugaanMdhu dhaivathvamu
kanupaRachinaavu vimaloapadhaeshamul viviDhMbugaa shiShya samudhayamunaku
nuththamugaa boaDhiMchi yamitha paapaharMbunaku bhuvinavathariMchina maenu
siluvanu shramanu mruthikalpiMchi mruthyuvuAOjMpi jeeviMchina mahaathmaa
||vMdhanamayyaa||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com