kreesthunaayaka nee dhayaaliniక్రీస్తునాయక నీ దయాళిని కీర్తన
క్రీస్తునాయక నీ దయాళిని కీర్తనలుగా బాడుదున్ నేస్తుతులతోఁ దండ్రి
దేవుని నిత్యమును గొండాడుదున్ ||క్రీస్తు||
1. సిలువ మోసిన నీ ప్రయాసను జెప్పుటకు నోరాడదు అలుకునొందక
స్వామి నీ ది వ్యాంఘ్రి చెంతను గూడుదు ||క్రీస్తు||
2. నిమిషమైన ంబాయకెదలో నిన్ను నే స్మరియింతును అమితమౌ దేవా
ను క్రోశము హర్షముగ వర్ణింతును ||క్రీస్తు||
3. యేసుప్రభు నా కాలమంతయు నేమఱక నీ నామము దాసునిగ
భజియంతు నిఁక నేఁ దప్పకుండను నీమము ||క్రీస్తు||
4. చచ్చి నే నరుదెంచి మోక్షము స్వామి నీ యుపకారముల్ హెచ్చు
ప్రేమను బాడుచుందును యెప్పుడును గైవారముల్ ||క్రీస్తు||
5. మలినమౌ నా నత్తి నాల్క స మాధిలోఁ గృశియింపను బలిమితోనేఁ
బాడుచుందును భక్తి యుజ్వలింపను ||క్రీస్తు||
6. కన్ను మూతలుగాను నీ సము ఖంబు కేను బిరాలను తెన్ను తప్పకవత్తు
శ్రీకర దేవ నను నీవేలను ||క్రీస్తు||
7. ముగ్గురొకఁడై వెల్గుచుండెడి మోక్షరాజ్య గరిష్ఠుఁడా యొగ్గుచేయక
నన్నుఁ బ్రోవవే యేసునాధ మహేశుఁడా ||క్రీస్తు||
8. భూతలములో నీ సమానముఁ బోల్చ నేదియుఁ గానము దాతవై మము
సలుపవే నీ తండ్రికిని సంధానము ||క్రీస్తు||
kreesthunaayaka nee dhayaaLini keerthanalugaa baadudhun naesthuthulathoaAO dhMdri
dhaevuni nithyamunu goMdaadudhun ||kreesthu||
1. siluva moasina nee prayaasanu jepputaku noaraadadhu alukunoMdhaka
svaami nee dhi vyaaMghri cheMthanu goodudhu ||kreesthu||
2. nimiShmaina Mbaayakedhaloa ninnu nae smariyiMthunu amithamau dhaevaa
nu kroashamu harShmuga varNiMthunu ||kreesthu||
3. yaesuprabhu naa kaalamMthayu naemaRaka nee naamamu dhaasuniga
bhajiyMthu niAOka naeAO dhappakuMdanu neemamu ||kreesthu||
4. chachchi nae narudheMchi moakShmu svaami nee yupakaaramul hechchu
praemanu baaduchuMdhunu yeppudunu gaivaaramul ||kreesthu||
5. malinamau naa naththi naalka sa maaDhiloaAO grushiyiMpanu balimithoanaeAO
baaduchuMdhunu bhakthi yujvaliMpanu ||kreesthu||
6. kannu moothalugaanu nee samu khMbu kaenu biraalanu thennu thappakavaththu
shreekara dhaeva nanu neevaelanu ||kreesthu||
7. muggurokAOdai velguchuMdedi moakShraajya gariShTuAOdaa yogguchaeyaka
nannuAO broavavae yaesunaaDha mahaeshuAOdaa ||kreesthu||
8. bhoothalamuloa nee samaanamuAO boalcha naedhiyuAO gaanamu dhaathavai mamu
salupavae nee thMdrikini sMDhaanamu ||kreesthu||