గాయాలతో వ్రేలాడెను
గాయాలతో వ్రేలాడెను సిలువలో కల్వరిపై
దేవుని కుమారుడు ఇదిగో మన రక్షకుడేసు ప్రభువు
తన దేహమంతా గాయాలు ఆయే చూడు
గాయాలతో వ్రేలాడెను
సిలువలో కల్వరిపై ప్రభువే
ప్రేమించి దీవించిన మన ప్రభుని
నిందించి కొరడాలతో హింసించే నరులు [2]
కరుణించి మేలులు చేసిన చేతిని
దూషించి సిలువకు కొట్టెరు చూడు
కరుణామయుడే ప్రభువు [1]
ఈ లోకపాపపు భారం మోసినా దేవుడే
బలిపశువుగా మరణించ్చెను చూడు [2]
మన పాపము నిమిత్తము బలిఆయెను ప్రభువు
మనుజాత్మ కలుషం తొలగించిన దైవం
ధన్యంబు ప్రభు త్యాగము ఇలలో [1]
