yaesu padhaambuja sharanm naraయేసు పదాంబుజ శరణం నర దోష మహాంబ
యేసు పదాంబుజ శరణం నర దోష మహాంబుధి హరణం యేసే
మార్గము యేసే సత్యము యేసే జీవము యేసుకు శరణం||
1. దేవకుమారశరణం నర జీవప్రదాత శరణం దేవదేవ
జగదావతారమము బ్రోవరావె ప్రభు నీవే శరణం ||
2. పాపవినాశక శరణం నర శాపవిమోచక శరణం పావనాత్మ భవదీయ
ప్రాణమిడి ప్రాపువైతివో ప్రభువా శరణం
3. పరమపురుషుడా శరణం ఓ నిరుపమప్రేమడ శరణం మరణ
మొంది మరి మృత్యుంజయుడై పరమున జరిగిన ప్రభువా శరణం||
4. నీతిపూర్ణమా శరణం జగ జ్యోతి రత్నమా శరణం జాతిభేదరాహిత్యుడ
హితుడా నీతిప్రబోధక నీవే శరణం
5. తేజోమూర్తికి శరణం విభ్రాజిత కీర్తికి శరణం రాజరాజ యో భారత
రాజ్య ప్రజాత్మ రక్షక ప్రభువా శరణం
yaesu padhaaMbuja sharaNM nara dhoaSh mahaaMbuDhi haraNM yaesae
maargamu yaesae sathyamu yaesae jeevamu yaesuku sharaNM||
1. dhaevakumaarasharaNM nara jeevapradhaatha sharaNM dhaevadhaeva
jagadhaavathaaramamu broavaraave prabhu neevae sharaNM ||
2. paapavinaashaka sharaNM nara shaapavimoachaka sharaNM paavanaathma bhavadheeya
praaNamidi praapuvaithivoa prabhuvaa sharaNM
3. paramapuruShudaa sharaNM oa nirupamapraemada sharaNM maraNa
moMdhi mari mruthyuMjayudai paramuna jarigina prabhuvaa sharaNM||
4. neethipoorNamaa sharaNM jaga jyoathi rathnamaa sharaNM jaathibhaedharaahithyuda
hithudaa neethipraboaDhaka neevae sharaNM
5. thaejoamoorthiki sharaNM vibhraajitha keerthiki sharaNM raajaraaja yoa bhaaratha
raajya prajaathma rakShka prabhuvaa sharaNM