• waytochurch.com logo
Song # 30264

సిలువలో సాగింది యాత్ర

siluvalo sagindhi yatra


Chorus:
సిలువలో సాగింది యాత్ర
కరుణామయుని దయగల పాత్ర (2)
ఇది ఎవరి కోసమో
ఈ జగతి కోసమే
ఈ జనుల కోసమే ||సిలువలో||

1
పాలు కారు దేహము పైన
పాపాత్ముల కొరడాలెన్నో (2)
నాట్యమాడినాయి నడి వీధిలో నిలిపాయి (2)
నోరు తెరువ లేదాయే ప్రేమ
బదులు పలుక లేదాయే ప్రేమ (2) ||ఇది ఎవరి||

2
చెళ్ళుమని కొట్టింది ఒకరు
తన మోముపైన ఉమ్మింది మరియొకరు (2)
బంతులాడినారు, బాధలను పెట్టినారు (2)
నోరు తెరువ లేదాయే ప్రేమ
బదులు పలుక లేదాయే ప్రేమ (2) ||ఇది ఎవరి||

2
వెనుక నుండి తన్నింది ఒకరు
తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు (2)
గేలి చేసినారు పరిహాసమాడినారు (2)
నోరు తెరువ లేదాయే ప్రేమ
బదులు పలుక లేదాయే ప్రేమ (2) ||ఇది ఎవరి||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No
  • Song youtube video link :
    Copy sharelink from youtube and paste it here

© 2025 Waytochurch.com