సృష్టికర్త దేవుడు కృపకలిగిన దేవుడు
సృష్టికర్త దేవుడు కృపగలిగిన దేవుడు
ప్రేమించే దేవుడు న్యాయాధిపతి దేవుడు
నీ మాటే జీవము నీ వాక్యమే సత్యము (2)
|| మధురమే నీ మాట సత్యమే నీ వాక్యము ||
ఆదియందు వాక్యముండెను
వాక్యము దేవునియొద్ద ఉండెను
ఆ వాక్యమే దేవాది దేవుడు
పాపమునుండి రక్షించే వాక్యము (2)
నీ మాటే జీవము, నీ వాక్యమే సత్యము
|| మధురమే నీ మాట సత్యమే నీ వాక్యము ||
ఆదియందు దేవుడే భూమిని చేసాడు
ఆదియందు దేవుడే ఆకాశాన్ని చేసాడు
ఆ దేవుని మాటలే పరిశుద్ధ గ్రంధము
ఆ గ్రంధమే మన రక్షణకు మార్గము (2)
నీ మాటే జీవము నీ వాక్యమే సత్యము
|| మధురమే నీ మాట సత్యమే నీ వాక్యము ||
పూర్ణహృదయముతో యెహోవాన్ని ఆరాధింతుము
పూర్ణ ఆత్మతో దేవున్ని ఘనపరచుడి
నీ మాటే జీవము నీ వాక్యమే సత్యము
|| మధురమే నీ మాట సత్యమే నీ వాక్యము ||
సృష్టికర్త దేవుడు కృపగలిగిన దేవుడు
ప్రేమించే దేవుడు న్యాయాధిపతి దేవుడు
నీ మాటే జీవము నీవాక్యమే సత్యము (2)
|| మధురమే నీ మాట సత్యమే నీ వాక్యము ||
