స్తుతిగానము చేసెదన్
Stutiganamu Chesedan
పల్లవి:
స్తుతిగానము చేసెదన్ స్తోత్రాలర్పించెదను (2)
ప్రియమైన తండ్రివి పరలోకవాసివి ఆరాధన నీకే (2)
నా జీవితాంతము నేను ఉన్నంతకాలము (2)
(స్తుతిగానము చేసెదన్)
చరణం 1:
శ్రేష్టులలో బహు శ్రేష్టుడవు
శ్రీమంతుడవు నీవేనయ్యా
ఘనులందరిలో ఘనీయుడవు
పరిశుద్ధుడవు నీవేనయ్యా (2)
రాజువయ్య రారాజువయ్య
రక్షకుడా విమోచకుడా (2)
నా జీవితాంతము నేను ఉన్నంతకాలము (2)
(స్తుతిగానము చేసెదన్)
చరణం 2:
తేనెకన్నా జుంటే, తేనెకన్నా
మధురము నీ పలుకే
తల్లి కన్నా కన్న తండ్రి కన్న
కమ్మని నీ పిలుపే (2)
అందదయ నా ఊహలకు నీ ప్రేమ, వాత్సల్యము (2)
నా జీవితాంతము నేను ఉన్నంతకాలము (2)
(స్తుతిగానము చేసెదన్)
