• waytochurch.com logo
Song # 30351

కుమ్మరించుము నీ ఆత్మను నాపై


"తరువాత నేను సర్వజనులమీద నా ఆత్మను కుమ్మరింతును; మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచనములు చెప్పుదురు; మీ ముసలివారు కలలుకందురుమీ యౌవనులు దర్శనములు చూతురు." - యోవేలు 2:28


కుమ్మరించుము నీ ఆత్మను నాపై నీకై జీవింతును
కృపనీయుము నీ యందు నిలచి నీకై ఫలియింతును
నన్ను కొన్న నా యజమానుడవే
అద్వితీయుడవు నీవే
యేసయ్య యేసయ్య యేసయ్య నా యేసయ్య
యేసయ్య యేసయ్య యేసయ్య నా యేసయ్య

పరిశోధకుడవు పరిపూర్ణతను ఇచ్చువాడవు నీవు
సత్యవంతుడవు బలమైన దుర్గమై నాతోడై నిలిచావు
నా కొరకై నీ ప్రాణమును క్రయధనముగ అర్పించినావు
యేసయ్య యేసయ్య యేసయ్య నా యేసయ్య
యేసయ్య యేసయ్య యేసయ్య నా యేసయ్య

పరలోకమును భూలోకమును ఏలువాడవు నీవు
మహిమతో నిండిన తేజోమయుడా వెలుగైన సర్వోన్నతుడా
శాశ్వతమైన నీ కృపను ధ్వజముగ నాపై నిలిపావు
యేసయ్య యేసయ్య యేసయ్య నా యేసయ్య
యేసయ్య యేసయ్య యేసయ్య నా యేసయ్య

ప్రతి స్థలమందున ప్రతి సమయమున నీ స్తుతినే పాడెదను
పరిశుద్ధాత్మతో అగ్నితోను నీలో హర్షింతును
నీ సాక్షిగ ఇల జీవింతును నా అతిశయము నీవే ప్రభు
యేసయ్య యేసయ్య యేసయ్య నా యేసయ్య
యేసయ్య యేసయ్య యేసయ్య నా యేసయ్య


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No
  • Song youtube video link :
    Copy sharelink from youtube and paste it here

© 2025 Waytochurch.com