• waytochurch.com logo
Song # 30353

నోరు తెరువని ప్రేమ


Chorus:-
ఘోర శ్రమలను పొందితివా యేసయ్యా
సిలువను మోస్తూ సొమ్మసిల్లి అలసిపోతివా ||2||

1 దేహమంతయు చీలిపోయేను కొరడాలతో కొట్టగా (2)
నోరు తెరువలేదు ప్రేమ బదులు పలుకలేదు ప్రేమ (2)
మౌనియైతివ యేసయ్య కరుణ గల యేసయ్యా (2) ||ఘోర శ్రమలను ||

2. చెల్లుమని కొట్టారు ఉమ్మిని ఊసారు ముఖముపై (2)
నోరు తెరువలేదు ప్రేమ బదులు పలుకలేదు ప్రేమ (2)
బాధనొందినావ జాలిగల యేసయ్యా (2) ||ఘోర శ్రమలను ||

3. బల్లెముతో పొడిచిరి రక్తమంతయు ధారపోసితివి (2)
నోరు తెరువలేదు ప్రేమ బదులు పలుకలేదు ప్రేమ (2)
ప్రాణమిచ్చినావ యేసయ్య నా ప్రాణ ప్రియుడా (2) ||ఘోర శ్రమలను ||

యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా..


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No
  • Song youtube video link :
    Copy sharelink from youtube and paste it here

© 2025 Waytochurch.com