namaskarimpa rmdi dhaaveedhu puthrunనమస్కరింప రండి దావీదు పుత్రున
1. నమస్కరింప రండి
దావీదు పుత్రుని
శ్రీ యేసు రక్షకుండు
ఏతెంచె భూమికి
న్యాయంబు లోకమందు
స్థాపించి నిత్యము
అన్యాయ మంతఁ దాను
పోఁగొట్టవచ్చెను.
2. వర్షంబు పడునట్లు
శుష్కించు నేలను
దుఃఖించు వారి కెల్ల
హర్షంబు నిచ్చును
శ్రీ యేసు రాజ్యమందు
సద్భక్తులందఱు
ఖర్జూర వృక్ష రీతిన్
వర్ధిల్లుచుందురు.
3. దిగంతవాసు లైన
భూరాజు లందఱు
శ్రీ యేసు చరణంబుల్
నమస్కరింతురు
భూలోకవాసులైన
జనంబు లందఱు
క్రీస్తు స్వాధీనమందు
జీవింతు రెప్పుడు.
4. విరోధులైన వారిన్
జయింప నెన్నఁడున్
సింహాసనంబుమీఁద
ఆసీనుఁడగును
అత్యంత ప్రేమమూర్తి
శ్రీ యేసు ప్రభువు
ఆ దివ్య నామకీర్తి
వ్యాపించు నీ భువిన్.
1. namaskariMpa rMdi
dhaaveedhu puthruni
shree yaesu rakShkuMdu
aetheMche bhoomiki
nyaayMbu loakamMdhu
sThaapiMchi nithyamu
anyaaya mMthAO dhaanu
poaAOgottavachchenu.
2. varShMbu padunatlu
shuShkiMchu naelanu
dhuHkhiMchu vaari kella
harShMbu nichchunu
shree yaesu raajyamMdhu
sadhbhakthulMdhaRu
kharjoora vrukSh reethin
varDhilluchuMdhuru.
3. dhigMthavaasu laina
bhooraaju lMdhaRu
shree yaesu charaNMbul
namaskariMthuru
bhooloakavaasulaina
janMbu lMdhaRu
kreesthu svaaDheenamMdhu
jeeviMthu reppudu.
4. viroaDhulaina vaarin
jayiMpa nennAOdun
siMhaasanMbumeeAOdha
aaseenuAOdagunu
athyMtha praemamoorthi
shree yaesu prabhuvu
aa dhivya naamakeerthi
vyaapiMchu nee bhuvin.