• waytochurch.com logo
Song # 30374

ప్రేమకు ప్రతిఫలముప్రాణ త్యాగమా


మమతతో మనిషిని మలిచావయ్యా
ప్రేమతో పాపిని పిలిచావయ్యా
మమతకు ఫలితము నీ మరణమా
ప్రేమకు ప్రతిఫలము నీ ప్రాణమా

ప్రేమనే చూపిన - నీ దేహము
కొరడా దెబ్బలతో -తల్లడిల్లేనే
కరుణను చూపిన నీ ముఖము
మూర్కుల చేతిలో చిద్రమాయెనే

---- నాకై నలుగురిలో నలిగిపోతివే

బరువైన సిలువను మోయుచు
షాలేము వీదులలో సొమ్మసిల్లెనే
మూడుమేకులపై అల్లాడుతూ
పాపికై సిలువలో మరణమాయెనే

------ నాకై కలువరిలో కన్నుమూసేనే

మమతతో మనిషిని మలిచావయ్యా
ప్రేమతో ప్రతి పాపిని పిలిచావయ్యా
మమతకు ఫలితము నీ మరణమా
ప్రేమకు ప్రతిఫలము నీ ప్రాణమా


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No
  • Song youtube video link :
    Copy sharelink from youtube and paste it here

© 2025 Waytochurch.com