neevu naa dhaevumdavai yu nnaaనీవు నా దేవుండవై యు న్నావు యేస
Chords: ragam: ముఖారి-mukhaari
నీవు నా దేవుండవై యు న్నావు యేసు నాధ నీవిలఁ బ్రోవవే నన్నుఁ
గావవే ||నీవు||
1. పాప మానవ శాప భారము నోపి సిల్వను బడిన క్షేమా ధిపతి
సర్వ భూపతి ||నీవు||
2. శ్రేయమౌ కా యంబు భక్తుల కీయ సిద్ధముఁ జేయు యేసు
నాయకా మోక్ష దాయకా ||నీవు||
3. జీవ మారెడి త్రోవ నేఁబడి చావనై యున్నాను పతిత పావనా యాత్మ
జీవనా ||నీవు||
4. జాగుసేయక బాగుసేయను రాఁగదె నే ఘోర పాప రోగిని దఃఖ
భాగిని ||నీవు||
5. పాపమున నా రూపు మాపితి ప్రాపు నీవని నమ్మితిని నను లేపనా
కృపను జూపవా ||నీవు||