• waytochurch.com logo
  • Song - 3039 : mmgalamuaobaadare kreesthunaku-మంగళముఁబాడరె క్రీస్తునకు జయ మం Lyrics - Andhra Kristava Keerthanalu

  • Quick search
  • Chords: ragam: బిలహరి-bilahari

    మంగళముఁబాడరె క్రీస్తునకు జయ మంగళముఁబాడరె యో ప్రియులారా మంగళముఁ బాడరెర్ మంగళముఁ బాడి దు స్సంగతిని వీడి ప్రభు సంగులను గూడి మదిఁ బొంగుచుఁ జెలంగుచును ||మంగళము||

    1. రాజులకు రాజని దూతలచేత పూజఁగొనువాఁడని తేజమున సూర్యునికి దీప్తి నిడు సద్గుణ వి రాజితుని సాధుజన రక్షకుని పక్షముగ ||మంగళము||

    2. కరుణ గల వాఁడని పాపులఁబ్రోచు బిరుదుగొనినాఁడని మరణమును దానిఁ బరి మార్చు ఘన శక్తిగల పరమ గురుఁడితఁదె మన పాలి వాఁడని శుభ||మంగళము||

    3. సంగీతము పాడుచు సువార్త ప్ర సంగములఁ గూడుచు నింగికిని భూమికిని నిత్యముగ నేలఁ దగు శృంగారపు రాజునకు క్షేమ మగు ఆమేనిని||మంగళము||

    Language:TELUGU | Author:పురుషోత్తము చౌధరి | Album:Andhra Kristava Keerthanalu | Category :క్రీస్తునకు మంగళార్చన | 818 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 5537858
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com