• waytochurch.com logo
Song # 30399

నీ కృపయే నా ఆధారము అతిశయించుటకు కారణము

Nee Krupaye Naa Aadhaaramu


నీ కృపయే నా ఆధారము - అతిశయించుటకు కారణము (2)
యేసయ్య గొప్పవాడా - నా ఆనందం నీవేనయ్యా (2)

నీ ప్రేమ నన్ను చేర్చుకున్నది - నా ప్రియుడా
నేను ఉన్నానని చేయి చాపి - నీ దరి చేర్చితివే (2)
ఒంటరితనములో నాతో నిలిచావు
నా కన్నీరు తుడిచావు (2)

విడువలేదయ్యా నన్ను ఎన్నడను
మరువలేనయ్యా నేను నీ ప్రేమను (2)

నీ కృపతో నన్ను దర్శించితివే - అనుదినము నూతనముగా
ఇచ్చావు నాకు నీ స్థానము - నీతో ఉండుటకై (2)
చీకటిలో నాకు వెలుగయ్యావు
మరణములో నాకు జీవమయ్యావు (2) ||విడువలేదయ్యా||

తల్లి గర్భమునందే ఎన్నిక చేసి - నీకై ప్రతిష్టించితివే
నీ చిత్తము నాలో జరిగించుటకై - దయతో పిలచితివే (2)
శోధనలో నన్ను బలపరిచావు
నిందలలో నన్ను హెచ్చించావు (2) IIవిడువలేదయ్యా||

nee krupaye naa aadhaaramu - athishayinchutaku kaaranamu (2)
yesayya goppavaadaa - naa aanandam neevenayyaa (2)

nee prema nannu cherchukunnadi - naa priyudaa
nenu unnaanani cheyi chaapi - nee dari cherchithive (2)
ontarithanamulo naatho nilichaavu
naa kanneeru thudichaavu (2)

viduvledayyaa nannu ennadu
maruvalenayyaa nenu nee premanu (2)

nee krupatho nannu darshinchithive - anudinamu noothanamugaa
ichchaavu naaku nee sthaanamu - neetho undutakai (2)
cheekatilo naaku velugayyaavu
maranamulo naaku jeevamayyaavu (2) ||viduvaledayyaa||

thalli garbhamunande ennika chesi - neekai prathishtinchithive
nee chiththamu naalo jariginchutakai - dayatho pilachithive (2)
shodhanalo nannu balaparichaavu
nindalalo nannu hechchinchaavu (2) ||viduvaledayyaa||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No
  • Song youtube video link :
    Copy sharelink from youtube and paste it here

© 2025 Waytochurch.com