mmgalamae yaesunaku manujaavatమంగళమే యేసునకు మనుజావతారునకు శ
Chords: ragam: తోడి-thoadi
మంగళమే యేసునకు మనుజావతారునకు శృంగార ప్రభువునకు
క్షేమాధిపతికి ||మంగళమే||
1. పరమ పవిత్రునకు వరదివ్య తేజునకు నిరుపమానందునకు నిపుణ
వద్యునకు||మంగళమే||
2. దురిత సంహారునకు వరసుగుణోదారునకు కరుణా సంపన్నునకు
జ్ఞానదీప్తునకు||మంగళమే||
3. సత్య ప్రవర్తునకు సద్దర్మశీలునకు నిత్యస్వయంజీవునకు నిర్మలాత్మునకు||మంగళమే||
4. యుక్తస్తోత్రార్హూనకు భక్తరక్షామణికి సత్యపరంజ్యోతి యగు
సార్వభౌమునకు||మంగళమే||
5. నరఘోర కలుషముల నురుమారంగ నిల కరుదెంచిన మాపాలి వర
రక్షకునకు||మంగళమే||
6. పరమపురి వాసునకు నరదైవ రూపునకు పరమేశ్వర తనయునకు
బ్రణుతింతుము నిన్ను ||మంగళమే||