• waytochurch.com logo
Song # 30401

ప్రకటింతును నీ సువార్తను

Prakatinthunu Nee Suvaarthanu


ప్రకటింతును నీ సువార్తను
సకల జనులకు సహనముతో
సత్య వాక్యము ధ్యానించుచు
సమయమునందు అసమయమునందు (2) ||ప్రకటింతును||

లోకము నన్ను ద్వేషించినా
లోకులు నన్ను దూషించినా (2)
నా వారే నను నిందించినా
నా ప్రియులే నను విడనాడినా (2)
నిందలు మోపి హింసలు పెట్టినా
ప్రకటింతును నీ సువార్తను (2) ||ప్రకటింతును||

ఆత్మల రక్షణ కొరకై నేను
అలయక ముందుకు సాగెదను (2)
అంతము వరకు ప్రకటింతును
మరణించి లేచిన ప్రభు యేసును (2)
హత సాక్షులలో చేరుటకైనా
ప్రయాసపడెద సువార్తకై (2) ||ప్రకటింతును||

గురియొద్దకు నేను పరుగెత్తుచూ
తిన్నని మార్గము నే నడిచెద (2)
యేసుని పనులను శ్రద్ధతో చేయుచు
జీవ మకుటము ఆశించుచూ (2)
జీవ పునరుత్థానమునే
పొందుటకై నే ప్రకటింతును (2) ||ప్రకటింతును||

prakatinthunu nee suvaarthanu
sakala janulaku sahanamutho
sathya vaakyamu dhyaaninchuchu
samayamunandu asamayamunandu (2) ||prakatinthunu||

lokamu nannu dveshinchinaa
lokulu nannu dooshinchinaa (2)
naa vaare nanu nindinchinaa
naa priyule nanu vidanaadinaa (2)
nindalu mopi himsalu pettinaa
prakatinthunu nee suvaarthanu (2) ||prakatinthunu||

aathmala rakshana korakai nenu
alayaka munduku saagedanu (2)
anthamu varaku prakatinthunu
maraninchi lechina prabhu yesunu (2)
hatha saakshulalo cherutakaina
prayaasapadedha suvaarthakai (2) ||prakatinthunu||

guriyoddaku nenu parugethuchoo
thinnani maargamu ne nadicheda (2)
yesuni panulanu shraddhatho cheyuchu
jeeva makutamu aashinchuchoo (2)
jeeva punarutthaanamune
pondutakai ne prakatinthunu (2) ||prakatinthunu||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No
  • Song youtube video link :
    Copy sharelink from youtube and paste it here

© 2025 Waytochurch.com