జీవించువాడవు దీవించు వాడవు
Jeevinchuvaadavu dheevinchu vaadavu
జీవించువాడవు దీవించు వాడవు యేసయ్య నీ పాదాలె ఆధారము ప్రేమించు వాడవు క్షమియించు వాడవు యేసయ్య కారుణ్యాలే ఆశ్రయము ఆ కలువరి ధారి సిలువలో వ్రాలి ఇచ్చితివి మా కొరకై నీ ప్రాణం IIజీవించుII1. మేమేమైయున్న నీ చిత్తమే కదా కాపాడుతున్న నీ హస్తమే కదా (2) ఆరోగ్య దాతవు ఐశ్వర్య మూర్తివి సిరులిచ్చు వాడవు శ్రీమంతుడవు (2) IIజీవించుII2. నీ వాక్య ధారలే మాకాహారము నీ రక్త ధారలే మా జీవ పానము (2) వాగ్దాన భూమిలో నడిపించువాడవు వారసులుగా మమ్ము పిలిచిన దేవుడవు (2) IIజీవించుII
